మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్పై విచారణ కోరుతూ ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టు నాయకుడు హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి)ను ఆశ్రయించారు. ఎన్కౌంటర్ ఫేక్ అయ్యి ఉండి అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్లు 52/2025, 53/2025లో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని న్యాయవాది ఆరోపించారు.

