విరాట్ కోహ్లీ మూడో వన్డేలో రోహిత్ శర్మతో కలిసి భారత్‌కు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ సెంచరీతో (121 పరుగులు) అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని 33వ వన్డే సెంచరీ కాగా, ఓవరాల్ 50వ అంతర్జాతీయ సెంచరీ. కోహ్లీ, రోహిత్ 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని 19వ సారి నెలకొల్పారు. సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ, కుమార్ సంగక్కర- తిలకరత్నే దిల్షాన్ మాత్రమే ఇప్పుడు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డును కలిగి ఉన్నారు.

