
మహారాష్ట్రలో హిందీ భాషను తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఈ మేరకు ప్రకటన చేశారు. శివసేన (ఉద్ధవ్ థాకరే), రాజ్ థాకరే పార్టీ ఎంఎన్ఎస్ జూలై 5న ఒకటవ తరగతి నుంచి హిందీని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇంతలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యను నిర్ణయిస్తామని ప్రకటించారు.