
రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదిత చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి న్యాయ నిపుణులు, ప్రభుత్వం మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం.
తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ ఇటీవలే ఓ తీర్మానం చేసింది.