
ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు ఆయుష్ శెట్టి, లక్షసేన్‌లు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్,
చిరాగ్ శెట్టి జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో జయభేరి మోగించి ముందంజ వేసింది. గురువారం జరిగిన సింగిల్స్ పోరులో ఆయుష్ 21-19, 12-21, 21-14తో ప్రపంచ 9వ ర్యాంక్ ఆటగాడు నరకొరా (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. లక్షసేన్ హోరాహోరీ పోరులో భారత్‌కే చెందిన ప్రణయ్‌ను ఓడించాడు.