
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీకి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే బండి సంజయ్‌ను పదవిలో నుంచి తొలగించింది వాస్తవం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.