
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగా కొందరు భావిస్తున్నారు. జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతోంది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను థియేటర్లు మూసివేస్తామని నేరుగా హెచ్చరికలు చేస్తున్నారంటే ఆ హెచ్చరికల వెనుక ఉన్న గొంతుల గురించి వారిని నడిపిస్తున్నవారెవరన్నది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.