
హరికృష్ణ తనయుడు, దివంగత జానకిరామ్ తనయుడు (ఎన్టీఆర్) హీరోగా కొత్త సినిమా మొదలైంది. హరికృష్ణ మనవడి సినిమా ప్రారంభోత్సవం జరిగితే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక్క ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశం అవుతుంది. సినిమా ప్రారంభోత్సవం రోజున ఎన్టీఆర్ కుమార్తెలు అటెండ్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్స్ చేశారు. సినిమా ప్రారంభోత్సవం రోజున హరికృష్ణ కుమారులు కనిపించలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదని చాలా మంది వేలెత్తి చూపిస్తున్నారు.