హానుమాన్ భక్తుడు అయిన చిరంజీవి హనుమాన్ జయంతి వేళ ఆసక్తి కర అంశాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

