తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీరేటుతో రుణాలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠకు తెలిపారు. భవిష్యత్ కనెక్టివిటీకి కీలకమైన భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు అమరావతి మీదుగా చెన్నై వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కారిడార్, బందరు పోర్ట్కు వెళ్లే గ్రీన్ఫీల్డ్ రహదారి, అలాగే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కూడా ఇరువురు విస్తృతంగా చర్చించారు.

