పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకున్న తెలుగు తేజం ఇంకా కుదురుకోలేదు. దాంతో.. వెంటనే కోర్టులోకి దిగేందుకు ఆమె సిద్ధంగా లేదు. సో.. స్విట్జర్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని సింధు నిర్ణయించుకుంది. రెండోసారి కూడా ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కంగుతిన్న లక్ష్య సేన్ సైతం ఈ పోటీల్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.

