ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఐపీఓ కోసం అధికారికంగా దరఖాస్తు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎలాన్ మస్క్ నాయకత్వంలో ఉన్న ఈ కంపెనీ, ఐపీఓ ద్వారా దాదాపు 75 బిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ఎక్స్ కంపెనీ మొత్తం విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని సమాచారం. కంపెనీలో మొత్తం ఓటింగ్ పవర్లో 85.1 శాతం నియంత్రణ మస్క్ చేతుల్లోనే ఉంది.

