తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, సినీ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజను ప్రభుత్వం నియమించింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

