పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వయనాడ్ గురించి మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఎంపీలు కూడా టీ పార్టీలో చేరారు. ఈ సమావేశాన్ని చాలా స్నేహపూర్వకంగా ముగించారు.

