
స్థానిక సంస్థలకు వెళ్లేందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏసీబీ ఆఫీసులో విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగు గోడల మధ్య ఎందుకు నాలుగు కోట్ల మంది ముందు లైడిటెక్టర్ సవాల్ విసిరితే రేవంత్ పారిపోయాడని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. తొమ్మిది గంటల పాటు అడిగిందే అడిగారన్నారు.