ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కోసం రూ.400 విడుదల చేసింది… రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అటు ఆర్టిసిపై భారం పడకుండా… ఇటు మహిళలకు ఉచిత ప్రయాణం ఆగకుండా ఉండేందుకు టైట్ టు టైమ్ స్త్రీశక్తి పథకానికి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ వరకు అంటే 75 రోజులపాటు మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు ప్రభుత్వం నిధులు విడుదలచేసింది. అక్టోబర్ చివరినాటికి దాదాపు ఏడెనిమి కోట్లమంది ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించివుంటారు.

