
హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోయారు. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం నిర్వహించిన ట్రాన్స్జెండర్ అందాల పోటీలకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. స్టేజ్ మీదకు వచ్చిన విశాల్.. సడన్ గా సొమ్మసిల్లి పడిపోయారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాల్ స్పృహతప్పి పడిపోయిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఆహారం తీసుకోకపోవడం వల్లనే నటుడు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా తమిళ మీడియా పేర్కొంది.