
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓపీఎస్..
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ సందర్భంగా సమావేశమైన కొద్ది గంటల్లోనే పన్నీర్ సెల్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.