సీబీఎస్ఈ బోర్డు పరిధిలోని అన్ని స్కూళ్లలో కూడా హైరిజల్యూషన్ సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్కూళ్ల ఎంట్రీ, ఎక్జీట్, క్యాంటీన్, ప్లేగ్రౌండ్, స్టోర్ రూమ్, లైబ్రరీ, తరగతి గదులు ప్రతి చోట హైరిజల్యూషన్ తో కూడిన సీసీటీవీ కెమారాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అవి ఆడియో, వీడియోలతో పాటు కూడిన హైరిజల్యూషన్ తో పదిరోజులు నిల్వ ఉంచేవిగా చూసుకుని ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ అన్ని స్కూళ్లకు ఆదేశించింది. ముఖ్యంగా విద్యార్థుల భద్రత తమకు ముఖ్యమని సీబీఎస్ఈ పేర్కొంది.

