స్కూల్‌కు వెళ్లేందుకు చిన్నారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాడుతున్నారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ దుస్థితి నెలకొన్నది. వాల్డా గ్రామ విద్యార్థులు చదువుల కోసం ఐదు కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రఖాడీ నదిపై నిర్మించిన ఆనకట్టపై నడిచి వెళ్తే మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రఖాడీ నదిపై వంతెన నిర్మించాలన్న గ్రామస్తుల డిమాండ్‌ను పాలకులు చాలాకాలంగా పట్టించుకోవడంలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

