స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో నిధుల మళ్లింపు, నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇడి పేర్కొంది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఇడి తేల్చింది. ఈ కేసులోనే చంద్రబాబు ను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలు లో పెట్టింది.

