ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణలు, డ్రోన్ దాడులపై విరుచుకుపడుతుండటం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్,
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. ఇరువురు నేతలతో సంభాషణల్లో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై ఇరాన్ జరుపుతున్న దాడులను మోదీ ఖండించారు. రెండు దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆరా తీశారు.

