పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా (ఫేస్బుక్ మాతృ సంస్థ) విఫలమైందని అమెరికాలోని న్యూ మెక్సికో జ్యూరీ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అశ్లీల వీడియోలు, ఫొటోలు, అక్రమ చర్యలకు ప్రేరేపణ, మానవ అక్రమ రవాణా లాంటి ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించడంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ విఫలమయ్యాయని జ్యూరీ అభిప్రాయపడింది. ఈ కారణంగా మెటాకు రూ.3,161 కోట్ల భారీ జరిమానా విధించింది.మరో కేసులో కేజీఎం అనే యువతి కుంగుబాటు, ఆందోళనకు మెటా, గూగుల్‌ను కాలిఫోర్నియా జ్యూరీ బాధ్యులుగా చేసింది

