
దేశంలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో, తాజాగా విడుదలైన గణాంకాల్లో తెలంగాణ రాష్ట్రం అత్యధిక సైబర్ నేరాల నమోదుతో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటున 4.8 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 40.3 శాతంగా నమోదైంది. ఇది ఆందోళనకరంగా మారింది.దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో చాలా శాతం తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం. ఇది రాష్ట్రానికి అప్రతిష్ఠను కలిగిస్తోంది.