జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. “వికసిత్ భారత్” పథకం గురించి ఫోన్ చేస్తున్నట్లు సదరు వ్యక్తి ఎమ్మెల్యేను నమ్మించాడు. అర్హుల జాబితా పంపిస్తే రూ.10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పాడు. దీనికి ముందుగా నగదు పంపాలని ఎమ్మెల్యేకు సూచించాడు. ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున రూ. లక్ష ప్రాసెసింగ్ ఫీజు పల్లా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించాడు.మళ్లీ మళ్లీ ఫోన్ చేసి నగదు అడగటంతో పల్లా రాజేశ్వర్ తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

