
ిరిజన సంఘం మహిళా నాయకురాలి పట్ల అనుచితంగా వ్యవహరించిన సైదాబాద్ ఎస్ఐ సాయిక్రిష్ణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన మహిళా నాయకురాలు పట్ల ఎస్ఐ సాయి కృష్ణ వ్యవహరించిన తీరుపై సమగ్రంగా విచారణ జరిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.