సృష్టి సరోగసీ అక్రమాల కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. ఈ కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం రెండు రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారణ జరగనుంది. ఈ కేసు సరోగసీ పేరుతో అక్రమాలు, హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో సంబంధం ఉండటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

