
సూర్యుడిపై నిరంతరం అణుబాంబులు పేలినట్లు పేలుతూ ఉంటాయి. అత్యంత శక్తిమంతమైన వేడి రాకాసి గాలులు అంతరిక్షంలోకి బయలుదేరతాయి. అలాంటి గాలులు ఇప్పుడు భూమివైపు వస్తున్నాయి. వాటి ప్రభావం యూరప్‌పై ఎక్కువగా ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజులు వేడి గాలులు ఎక్కువగా వీస్తాయి. తెలంగాణలో 4 రోజులు ఎండలు దంచేస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఐతే.. ఫిబ్రవరి 28 నుంచి వాతావరణం మారుతుంది. మేఘాలు ఉన్నప్పుడు చల్లగా, లేనప్పుడు వేడిగా వాతావరణం ఉంటుంది.