గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు ఒక మార్పు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛను నగదును అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సూపర్ సిక్స్ హామీలు ఇస్తే అవి అసాధ్యమన్నారని కానీ ఇవాళ సూపర్ సిక్స్‌ని సూపర్ సక్సెస్ చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

