సోమవారం స్వల్ప లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. గత నాలుగు సెషన్లలో విదేశీ మదుపర్లు 14, 269 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల
సంకేతాలు కూడా సూచీల నష్టాలకు కారణంగా నిలిచాయి. ఇక, కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు కూడా నెగిటివ్గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి.

