
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే రోజుపై క్లారిటీ వచ్చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్‌షిప్‌లో వారు అంతరిక్షం నుంచి భూమికి తిరిగిరానున్నట్లు నాసా అధికారులు తేల్చి చెప్పారు. 2025 మార్చి 16వ తేదీన సునీత, విల్‌మోర్ ఇద్దరూ తిరిగి భూమిపైకి వస్తారని తాజాగా నాసా అధికారులు వెల్లడించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ 10 రోజుల మిషన్‌లో భాగంగా గతేడాది జూన్ 5వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు.