
కీర్ స్టార్మర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం వీరిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వివాదాస్పదంగా మారింది. ఇందులో బ్రిటన్ ప్రధాని కీర్ సీట్ బెల్ట్ ధరించి ఉండగా.. నరేంద్ర మోదీ మాత్రం సీట్ బెల్ట్ ధరించకుండా ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే ఈ విషయంపై నెటిజన్లు మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. పోరుగుదేశం ప్రధాని మన దేశంకి వచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే మన దేశ ప్రధాని మాత్రం రూల్స్ పాటించకుండా ఫొటోలకు ఫోజులిస్తాన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.