
త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్రం హోం మంత్రి అమిత్‌షా బుధవారంనాడు కీలక సమావేశం జరిపారు. ఈ సమవేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 సీట్లు గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో నిలబడి 43 చోట్ల గెలిచింది. ఎల్జేపీ 135 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది.