
సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై అడ్వకేట్ రాకేశ్ కిషోర్ షూ విసిరే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఇవాళ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కీలక నిర్ణయం తీసుకున్నారు. అడ్వకేట్ రాకేశ్ కిషోర్‌పై నేరపూరిత కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. 1971 నాటి కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 15(1)(బీ) కింద నేర కోణంలో అడ్వకేట్ రాకేశ్‌పై విచారణ చేపట్టేందుకు అనుమతి ఇస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు.