పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ దుస్థితి మరింతగా నెలకొన్నది. సీఎన్జీ గ్యాస్ కోసం బుధవారం అంబర్పేటలో మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లో వేచి ఉండటం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. కాగా, హైదరాబాద్ నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఎల్పీజీ ధర రూ.63 ఉండగా, ఇప్పుడు రూ.90 దాటిందని వాపోతున్నారు.

