మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమంలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం సంచనల వ్యాఖ్యలు చేశారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలగాల్సిన రావొచ్చునన్నారు. పదవిలో శాశ్వతంగా తాను ఉండలేనని.. ఐదున్నర సంవత్సరాలు అయ్యిందని.. మార్చినాటికి ఆరు సంవత్సరాలు అవుతుందన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నారు. తాను ఆయన నాయకత్వంలోనే ముందు వరుసలో ఉంటానని.. ఎవరూ చింతించొద్దన్నారు.

