కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలోని మండకల్లి నుండి దిల్లీకి తిరిగి వెళ్లేందుకు మండకల్లి విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో రాహుల్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయనతో డిప్యూటీ సీఎం డీకే కాసేపు సంభాషించారు. విమానాశ్రయంలో రాహుల్, డీకే మాట్లాడుకున్న ఫొటోలు కర్ణాటక అధికార పక్షంలో సంచలనం సృష్టించాయి. ఇంతకీ వారు ఏం చర్చించారు ? డీకే ఏం అడిగారు? రాహుల్ ఏం చెప్పారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 16న తాను దిల్లీకి వెళ్తున్నట్లు వెల్లడించారు.

