సింగరేణి టెండర్ల దొంగలపై హరీష్ రావు ఆధారాలు ఇచ్చినా.. చర్యలు ఎందుకు లేవు..? స్వయంగా మంత్రి కుమారుడు గూండాగిరి చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. సీఎం బావమరిది కింగ్ పిన్ అని ఆధారాలు ఇచ్చినా సిట్ ఎందుకు లేదు. మమ్మల్ని విచారించడంపై లీకులు మీడియాకు ఇస్తారు. న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేరకంగా ఉండాలి. తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

