
నక్సల్ కమాండర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. మల్లోజుల తన వద్ద ఉన్న ఆయుధాన్ని సీఎం ఫడ్నవీస్‌కు అప్పగించారు. నక్సల్ కమాండర్ మల్లోజులతో పాటు సుమారు 60 మంది నక్సలైట్లు తమ వద్ద ఉన్న ఆయుధాలను ఇవాళ గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రంలో సీఎం ఫడ్నవీస్‌కు అప్పగించారు.