
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్‌లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ మీనన్ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియాల్టి, టౌన్ షిప్‌లు, లగ్జరీ హోటళ్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు
పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.