
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో తరచూ ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీ స్థాయి హాస్టల్స్‌లోని సమస్యలను పరిష్కరించేందుకుగాను రూ. 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్స్‌ను ఆయన విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ. 20 కోట్లు.. అలాగే ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ. 10 కోట్ల చొప్పున ఆయన ఫండ్స్ రిలీజ్ చేశారు.