అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర కేబినెట్ తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని ఏపీకి సూచించింది. ఈ సూచన మేరకు ఈ నెల 28న శాసనసభలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

