
ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నియామకాలు చేపట్టింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థి అన్నింటిలో పాస్ అయ్యాడు.16మార్చి 2021న నియామక పత్రం కూడా అందుకున్నాడు. ఇంతలో ఎస్బీఐ అతడికి షాక్ ఇచ్చింది. సిబిల్ స్కోర్ పేలవంగా ఉండటంతో ఉద్యోగం ఇచ్చేది లేదు అని స్పష్టం చేసింది. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో కంగుతిన్న అతగాడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఎస్బీఐ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో అతడు ఉద్యోగాన్ని కోల్పోయాడు.