సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజులుగా వ్యక్తిగత కారణాలు, తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఐవీ ఇంజెక్షన్ ద్వారా గడ్డి మందును ఎక్కించుకున్నారు. తోటి జూనియర్ డాక్టర్లు గమనించి వెంటనే సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి లావణ్య మృతి చెందారు.

