రాత్రి ఏడున్నరకు విచారణ పూర్తి అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నంది నగర్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. చాలా యాక్టివ్‌గా కనిపించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ప్రత్యేకంగా కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నిలపై చర్చించారు. సిట్ విచారణపై మీడియాతో మాట్లాడతారని ప్రచారం జరిగింది. ఆయన మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సిట్ విచారణ తీరుపై లాయర్లు, కేటీఆర్, హరీష్‌తో చర్చించినట్టు సమాచారం అందుతోంది.

