ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా పరిశీలిస్తుందని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్‌తో పాటు మొత్తం సింగరేణి వ్యవస్థలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రుల మధ్య వాటాల గొడవలే ఈ అక్రమాలు బయటపడటానికి కారణమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

