
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ తొక్కిసలాటలో ప్రమాదానికి గురై వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ నేతలు కార్యకర్త సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.