
మంత్రి నారా లోకేష్ గురువారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూర్ పర్యటన సక్సెస్ అయిందని, మొత్తం రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అందరిలా “మేము ఎంవోయూలు కుదుర్చుకోవడం లేదు. ఒప్పందాల్ని నేరుగా అమలు చేసే దశకు తీసుకొస్తున్నాం,” అని లోకేశ్ అన్నారు. పెట్టుబడుల కోసం జూమ్‌కాల్ ద్వారా ఆర్సెలర్ మిత్తల్‌ను స్వయంగా ఆహ్వానించామని చెప్పారు.