టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్‌లో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగిస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు ఒక సాధారణ కార్యకర్తలా పాల్గొన్నారు. వర్క్ షాప్‌లో పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్ షాప్ జరిగింది. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై జరిగిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

