సమాజ అభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. CSR(corporate social responsibility) నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. కంపెనీలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు.

